TG: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమ అమలుపై గురువారం సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించామని, మొదటి దశలో భాగంగా 150 బస్సులను వెంటనే కొనడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.