బనానా టేప్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా సోథ్‌బే సంస్థ నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో 6.2 మిలియన్ డాలర్ల (రూ.52 కోట్లు) ధర పలికింది. ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించిన బనానా టేప్‌ను క్రిప్టోకరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ వేలంలో దక్కించుకున్నారు. ఆర్టిస్ట్ మౌరిజియో దీనికి 'కమెడియన్' అని పేరు పెట్టాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.