టెక్ రంగంలో ఉద్యోగాల లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఒక్క ఆగస్టులోనే ప్రపంచవ్యాప్తంగా 44 కంపెనీలు 27,065 మంది ఉద్యోగులను తొలగించాయి. జులైలో జరిగిన 9,051 ఉద్యోగాల తొలగింపుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని లేఆఫ్స్.ఎఫ్‌వైఏ పేర్కొంది. సవాళ్లతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఇంటెల్, సిస్కో సిస్టమ్స్, ఇన్ఫీయన్ కంపెనీలు సైతం ఇదే బాటలో ఉన్నాయి.