తెలంగాణలోని ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేకంగా 10 బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని.. ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. మొదటగా గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, MIM ఆసుపత్రుల నివేదిక అందించాలన్నారు.