పాలకొల్లు బంగారుబావి చెరువుగట్టు వేంచేసియున్న మావూరమ్మ అమ్మవారి ఆలయం వద్ధ బుధవారం 'అమ్మ పిలుస్తోంది రా ' వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. మావూరమ్మ వారికి, తులసి, ఉసిరి చెట్లకు కర్నేన గౌరునాయుడు రోజారమణి దంపతులు, కనమర్లపూడి చిన్న సత్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకరాపు శ్రీను, అచ్యుతరావు తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజకీయ నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.