యలమంచిలి పట్టణ పరిధిలో యానాద్రి కాలువ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఈ కాలువకు సంబంధించిన మ్యాప్ ను ఎలమంచిలి లో పరిశీలించి అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. యానాద్రి కాలువ ద్వారా వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి పెంజెరువులోకి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. యలమంచిలి మున్సిపల్ ఛైర్ పర్సన్ పిల్లా రమా కుమారి పాల్గొన్నారు.