నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఐ డిమాండ్ చేసింది. గోపాలపట్నం రైతు బజార్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సిపిఐ నాయకులు శ్రీనివాసరావు, రాంబాబు మాట్లాడుతూ.. మద్యం ధరలపై ఉన్న ఆసక్తి కూరగాయల ధరలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ధరలను నియంత్రించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.