చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిల కీలుబొమ్మలా మాట్లాడుతున్నారని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. షర్మిల మాటలు వైఎస్సార్ కుమార్తెల లేవని విమర్శించారు. సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి, స్వర్గంలో వైఎస్సార్ కూడా బాధపడతారన్నారు.