మతిస్థిమితం లేక విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిని పోలీసులు మానసిక సంరక్షణ గృహంలో చేర్పించారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని బీహార్ నుంచి రప్పించి శనివారం ఆ యువతని సురక్షితంగా అప్పగించారు. బాధ్యతగా విధులు నిర్వర్తించిన పోలీసులను కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.