ఏపీలో ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్ర లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం మంగళవారం సాయంత్రం తాజా బులిటెన్‌లో వెల్లడించింది. మంగళవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడిందని, అదిపశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి వాయు గుండంగా మారి 23వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేరొ‍్కంది.