విశాఖ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్‌ను ప్రైవేట్ వారికి పిపిపి పద్దతిలో ఇచ్చే ఆలోచన తక్షణమే విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన సాలిగ్రామంపురం వద్ద ఉన్న పోర్టు హాస్పిటల్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు బుధవారం తెలిపారు. పిపిపి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు.