విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అనకాపల్లి జోన్లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ అనకాపల్లి జోన్ల కార్యాలయంలో అనకాపల్లి సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ఉన్న గార్బేజ్ డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. క్లోజ్డ్ కంపాక్ట్ సిస్టం ద్వారా చెత్తను తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.