గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండవ రోజు గురువారం జనవాణి భరోసా కొనసాగుతుంది. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన అర్జీదారులతో మాట్లాడారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.