సింహాచలం ఈఓగా ఇప్పటివరకు పనిచేసిన ఎస్. శ్రీనివాసమూర్తి తన మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాతకు ఇన్ ఛార్జ్ ఈఓగా బాధ్యతలను మంగళవారం రాత్రి అప్పగించారు. ఆలయానికి విచ్చేసిన ఆమె కప్ప స్తంభాన్ని ఆలింగం చేసుకున్నారు. అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.