పెందుర్తి ప్రధాన కేంద్రంగా గల విశాఖ శ్రీశారదా పీఠానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ గురుదక్షిణగా బీమిలి, కొత్తవలస ప్రాంతంలో 15 ఎకరాల భూమిని ఇచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏ. సత్యప్రసాద్ మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. రూ. 300 కోట్ల విలువ చేసే భూములను కేవలం రూ. 15 లక్షలకు ఇవ్వడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను పీఠం వాణిజ్య పరంగా వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.