సనాతన ధర్మం పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళలను దారుణంగా వంచిస్తున్నట్లు ఏపీ మహిళ సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల, ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని, అభ్యుదయ రచయిత్రి మల్లేశ్వరి ఆరోపించారు. పెందుర్తి మండలం సుజాతనగర్ లో సిపిఐ కార్యాలయంలో సనాతన ధర్మం మహిళల హక్కులు అనే అంశంపై గురువారం సదస్సు నిర్వహించారు. మహిళలను వంటింటికే పరిమితం చేసేందుకు కేంద్రం కుట్రపన్నుతుందని వారు విమర్శించారు.