పరవాడ మండలంలో ఫార్మా పరిశ్రమలకు నీరు సరఫరా కాకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అనకాపల్లి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. బుధవారం పరవాడలో మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు నిల్వచేసిన నీటిని యాజమాన్యాలు ఉత్పత్తికి ఉపయోగిస్తున్నాయన్నారు. నీరు సరఫరా లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులను తగ్గిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ నీటి సరఫరా చర్యలు తీసుకోవాలని కోరారు.