రాష్ట్ర కార్మిక పారిశ్రామిక మంత్రి వాసంశెట్టి సుభాష్ అనకాపల్లి జిల్లా పరవాడలో శుక్రవారం పర్యటించనున్నారు. రోడ్డు మార్గంలో జిల్లాకు చేరుకుంటారని మంత్రి కార్యదర్శి వెంకట సురేశ్ గురువారం విజయవాడ నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా పరవాడ ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో పర్యటించి ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకుంటారు. అనంతరం విశాఖలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.