పరవాడ ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోవడం దురదృష్టకరమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు విచారం వ్యక్తం చేశారు. గురువారం సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం స్పందిస్తే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్నారు.