సింహాద్రి అప్పన్న చందన సమర్పణకు విశాఖ విశాలాక్షి నగర్ కు చెందిన ఏ. ఎస్. ప్రకాశరావు, లలిత దంపతులు బుధవారం రూ. లక్ష రూపాయలు విరాళాన్ని ఆలయ దేవస్థానం కౌంటర్లో అందజేశారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది వారికి రసీదు ఇచ్చారు. అనంతరం దంపతులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ పాల్గొన్నారు.