విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని డీఈవో అప్పారావు నాయుడు సూచించారు. నక్కపల్లిలో మూడు రోజులు పాటు నిర్వహించే అండర్-14 రాష్ట్రస్థాయి హాకీ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నం, జడ్పీటీసీ కాసులమ్మ, సర్పంచ్ జయ రత్నకుమారి, వైస్ ఎంపీపీ నానాజీ, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.