అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొండగోకిరి, రత్నంపేట పంచాయతీల పరిధిలో రత్నంపేట గ్రామాల మధ్యన కొండవాగు పై నిర్మించిన వంతెన రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మండలానికి చెందిన సుమారు ఐదు పంచాయతీల పరిధి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వంతెన కొట్టుకుపోయి స్థానికులు ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తూ ఆందోళన చెందుతున్నారు.