రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, అల్లూరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈనెల 4వ తేదీన పాడేరులో పర్యటించనున్నారని జిల్లా అధికారులు తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పార్టీ నాయకులు, శ్రేణులతో సమావేశం అవుతారని అన్నారు.