కొయ్యూరులో దేవి శరన్నవరాత్రి మహూత్సవాలలో భాగంగా శుక్రవారం కొండపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. సింగవరం గ్రామంలో గల దుర్గమ్మ ఆలయం, రేవళ్లు గ్రామంలో వెలసిన శాంతి దుర్గ ఆలయం, ఎం మాకవరంలో కనకదుర్గమ్మ మండపం వద్ద ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.