ఆదివాసీ పివిటీజీ యువతి మువ్వల రాణి గుండె సమస్యతో బాధపడుతుండగా, బిసిటీ స్వచ్ఛంధ సంస్థ సహకారం, కలెక్టర్ చొరవతో ఆమెకు చికిత్స అందించబడింది. రాణి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం లేకపోవడంతో, ఈ నెల 20న కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం పొందేలా కృషి చేయడంతో విశాఖపట్నం మేడికవర్ ఆసుపత్రిలో రాణికి విజయవంతంగా గుండె ఆపరేషన్ జరిగింది.