దసరా సెలవుల నేపథ్యంలో పర్యాటక ప్రాంతం అయినటువంటి పాడేరు, వంజంగి, అరుకు, లంబసింగి ప్రాంతాలలో గత వారం రోజులుగా ఎండలు మండిపోవడంతో పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే శుక్రవారం ఉదయం నుండి ముసురు తలపించేలా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. మన్యం ప్రాంతాలలో చినుకులు పడడంతో ఇంద్రధనస్సు ప్రత్యక్షం అయ్యింది. ఎండ ప్రభావం తగ్గుముఖం నేపథ్యంలో పర్యాటక సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.