పోర్టు హాస్పిటల్ ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకుంటామని సిఐటియు ఆల్ ఇండియా ఫెడరేషన్ కార్యదర్శి బి. జగన్ స్పష్టంచేశారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆసుపత్రి వద్ద చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను జగన్ ప్రారంభించి మాట్లాడారు. పోర్టు హాస్పిటల్ ప్రయివేటీకరణ ఆపాలని, పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.