నాలుగు రోజులు పాటు నగరంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి న్యూరాలజీ సదస్సు బుధవారం విశాఖ నోవాటెల్ హోటల్లో ప్రారంభమైంది. ఒకేసారి 4 సమావేశ మందిరాలలో ఒక్కొక్క అంశంపై సదస్సును ఏర్పాటుచేశారు. సదస్సులను ఐఎన్ఎ ప్రెసిడెంట్ డాక్టర్ దేబిశిష్ చౌదరి, సెక్రటరీ డాక్టర్ మీనాక్షి సుందరం, సదస్సుల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. బుచ్చిరాజు, కార్యదర్శి డాక్టర్ ఎస్. గోపి ప్రారంభించారు.