ఆర్థికంగా నష్టపోయాను. ఇదే నా చివరి అవకాశమని చేతులు కాళ్లు పట్టుకుంటే పీతల మూర్తికే ఓటు వేశాం. ఆయన గెలిచాక మా చేతిలో బొచ్చా పెట్టి అడుక్కోమంటున్నారని వీధి వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేశారు. 22వ వార్డులో స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దుకాణాలన్నీ ధ్వంసం చేయించడంతో రోడ్డు పాలైన వీధివ్యాపారులంతా బుధవారం జీవీఎంసీ ఎదురుగా భిక్షాటన చేశారు.