పశుగణన చేయడం వలన పెంపకం దారులకు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందని ఎలమంచిలి డివిజన్ పశుసంవర్ధక ఏడి గంగాధర్ అన్నారు. శుక్రవారం ధర్మవరం వార్డులో21వ అఖిలభారత పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గొర్రెలు, మేకలు, పశువులను సిబ్బందితో కలిసి లెక్కించారు. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఎన్. వరహాలు తదితరులు పాల్గొన్నారు.