విశాఖ జిల్లాలో కొన్నిచోట్ల మద్యం దుకాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. మొత్తం 155 మద్యం దుకాణాలను అధికారులు లాటరీ ద్వారా వ్యాపారులకు కేటాయించారు. దుకాణాలు దక్కించుకున్న వారంతా బుధవారం ఉదయం నుంచే విక్రయాలు ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే వంద దుకాణాలు మాత్రమే బుధ, గురువారాల్లో ప్రారంభం అయ్యాయి. మిగిలినచోట్ల భవనాలు లభ్యం కాకపోవడంతో దుకాణాలు ప్రారంభించడానికి అవకాశం లేకుండాపోయింది.