మాడుగులలో శుక్రవారం జరిగిన ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీలో విభేదాలు బయటపడ్డారు. ఉచితంగా అందజేసిన గ్యాస్ బండతో వేదిక దగ్గరలో గల ఒక ఇంట్లో టీ తయారు చేయించి ఎమ్మెల్యేకు అందజేశారు. దీంతో ఒక్కసారిగా దేశం వర్గాల్లో విభేదాలు రచ్చకేక్కాయి. వైసిపి కార్యకర్త ఇంట్లో టీ తయారు చేయించి ఎమ్మెల్యేకి ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ పంపిణీలో కూడా వైసీపీకి చెందిన కార్యకర్తకు మొదటి గ్యాస్ బండ ఇప్పించడంలో ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నించారు.