మాడుగుల శివారు అడవిలోని శ్రీ ఉబ్బలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే దారిలో ఉన్న ఈ బోరు సక్రమంగా పనిచేయడం లేదు. పావుగంట కొడితేనే కానీ చుక్కనీరు రావడం లేదు. ఈ వైపుగా వివిధ గిరిజన గ్రామాలు చెందిన గిరిజనులు మాడుగులకు రాకపోతే సాగిస్తుంటారు. పర్వదినాల్లో భక్తులు, అయ్యప్పలు, శివ భక్తులు, భవాని భక్తులు వంటివారు వస్తుంటారు. కాబట్టి అధికారులు తగు చర్యలు చేపట్టాలని మంగళవారం స్థానికులు కోరుతున్నారు.