మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు మంగళవారం మాస్టర్ కుటుంబ సభ్యులకు సంతాప సందేశాన్ని పంపించారు. 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.