ప్రభుత్వం స్వర్ణాoధ్ర -2047 సాధించే లక్ష్యందిశగా పశు సంవర్ధక శాఖ ముఖ్య సూచికలైన పాలు, మాంసం, గ్రుడ్లు ఉత్పత్తి సూచికలను ప్రతి సంవత్సరం 15 శాతం పెంచేందుకు పాడి రైతులు తీసుకోవాలసిన చర్యలపై మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు సోమవారం కె. జె. పురం పాలకేంద్రం వద్ద పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పాడి రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలంటే పశుగ్రాసాలు సాగు చేయాలన్నారు.