మహిళా సాధికారత దుష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పథకాన్ని ప్రవేశపెట్టి మహిళా సాధికారతకు పెద్దపెట వేశారని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. దీపం 2 పథకంలో భాగంగా శుక్రవారం మాడుగుల దేవి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాడుగుల నియోజవర్గంలో ఉచిత గ్యాస్ పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో 43 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.