మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో బీజేపీ భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం బిజెపి పార్టీ కార్యాలయం ఆనందపురం మండలం వెల్లంకిలో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు, బిజెపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి. వి. వి. ప్రసాదరావు పట్నాయక్ , మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు.