అనంతగిరి మండలలో అల్లూరి జిల్లా సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ సోమవారం పర్యటించారు. అనంతగిరి నుండి బొడ్డవర వరకు రోడ్డు నిర్మాణం జరిగే ఎన్ హెచ్ ఐ రోడ్డు విస్తరణ నిమిత్తం రోడ్డు ఇరువైపులా గృహ, ప్రభుత్వ, రైతుల భూములపై క్షుణంగా పరిశీలించారు. వారు మాట్లాడుతూ బిసు పురం నుండి డముకు వరకు రోడ్డు విస్తరణలో పనులు జరుగుతున్నప్పటికీ జిరాయతి భూములకు రైతులకు ఇబ్బంది కలగకుండా నష్టపరిహారం చెల్లిస్తామనీ తెలిపారు.