ముంచంగిపుట్టు మండలంలోని చలి తీవ్రత వణికిస్తోంది. మూడు రోజులు నుంచి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆగ్నేయ నుంచి విస్తున్న గాలులతో సాయంత్రం 5 అయిందంటే చాలు గిరిజనులు ఇల్లాలకే పరిమితమవుతున్నారు. ద్విచక్రవాహనదారులైతే ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్డుపై పొగమంచు కప్పుకున్న చలితో గజగజ వణికి పోతున్నారు. కాగా బూసిపుట్ తదితర గ్రామాల్లో చలికి తట్టుకోలేక గిరిజనులంతా గుమిగూడి చలి మంటలు కాస్తు ఉపశమనం పొందుతున్నారు.