పెదబయలు మండలంలోని గుల్లేలు పంచాయతీలోని సీమకొండకి వెళ్లే రహదారికి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 2 నెలల క్రితం కురిసిన భారీవర్షాలకు సీమకొండకి వెళ్లే రహదారి కొట్టుకుపోయి మట్టి పేరుకుపోయింది. బుధవారం సీమకొండకు కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ మట్టిరోడ్డులో ఇరుక్కుపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి ఈ రహదారి సమస్యపై స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.