అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని ఇందుకూరు పంచాయతీ పరిధి మంటూరు ఆర్ అండ్ బి కాలనీలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేశారు. టిడిపి నేత పండు వరలక్ష్మి మాట్లాడుతూ 2 నెలల క్రితం భారీ వర్షాల కారణంగా పాత దీపాలు దెబ్బతిన్నందున కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.