గూడెం కొత్త వీధి: నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా రింతాడ జంక్షన్ లో మంగళవారం విద్యార్థులతో పాటు పంచాయితీ కార్యదర్శి అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ సోమేష్ కుమార్, సచివాలయం సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, ఉపసర్పంచ్ సోమేశ్ కుమార్ మరుగుదొడ్ల ప్రాముఖ్యత, వాటి వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.