అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాశీపట్నం గ్రామపంచాయతీలో శుక్రవారం ఎంపీడీవో ఏవివి కుమార్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాశీపట్నం సచివాలయం పక్కన పేరుకుపోయి ఉన్న చెత్తలను శ్రమదానంగా తొలగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ శెట్టి నీలవేణి పాల్గొన్నారు. బహిరంగ మూత్ర విసర్జన, ప్లాస్టిక్ వ్యర్థాలను నివరించి పరిసరాల ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం వల్ల సంపూర్ణ ఆరోగ్యమని ఆమె సూచనలు అందించారు.