అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెదకోడపల్లి పంచాయతీకి చెందిన బంగారుపుట్టు గ్రామంలో సుమారు 200 మంది జనాభాతో 82 కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో జలజీవన్ మిషన్ ద్వారా బోర్ తీయించినప్పటికీ, మంచినీరు రావడం లేదు. అరకిలోమీటర్ దూరంలోని ఊటగడ్డ నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణం స్పందించి ఈ మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.