అరకులోయ మండలంలోని బస్కీలో మాడగడ పిహెచ్సి వైద్యాధికారులు ఉదయ ప్రశాంత్, జ్యోతి స్వరూప ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 60 మంది గిరిజనులకు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమల్ భాషా పాల్గొని ఇంటింటికెళ్లి గిరిజనుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని అవగాహన కల్పించారు.