జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి బాబు నాయక్ మాట్లాడుతూ, పీఎం జన్మన్ గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. బుధవారం అంత్రిగుడ పివిటిజి గ్రామంలో పథకం పై అవగాహన కల్పించి, నూతన గృహానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. మండల వ్యాప్తంగా 730 గృహాలు మంజూరు కాగా, తొలి విడతలో 432, రెండో విడతలో 70 నిర్మాణాలు చేపట్టబడ్డాయని చెప్పారు.