అనంతగిరి వాలసి పంచాయతీ గొర్రెగుమ్మి గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్ సన్యాసిరావు అధ్యక్షతన రూ 30 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథులుగా జడ్పిటిసి గంగరాజు,ఎంపీపీ నీలవేణి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా గిరిజనులు రోడ్డు లేక ఆయా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారుఅన్నారు.సిసి రోడ్డు నిర్మాణంతో రోడ్డు సమస్య ప్రజలకు తీరనుందన్నారు.