అనంతగిరి: రైల్వే ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కారం చెయ్యాలని సిఐటియు మండల కార్యదర్శి కిల్లో మోస్య మంగళవారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ కొత్తవలస నుండి అరుకు రైల్వే లైన్ లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి పీ. ఎప్ ఈ. ఎస్. ఐ సౌకర్యం కల్పించలని కోరారు. అన్స్కలెడ్ కార్మికులకు జీవో ప్రకారం రోజుకు రూ 526 ఇవ్వాలని కాంట్రాక్టులు రూ 10, 290 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.