అల్లూరి జిల్లా మన్యంలో ఈ ఏడాది కురిసిన వర్షాలు కాఫీ తోటలకు అనుకూలించాయి. అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీ, గాయబంధ తదితర గ్రామాల్లో కాఫీ పండ్లు విరగ్గాశాయి. మార్చి నుంచి జూలై వరకు కురిసిన వర్షాలు కాఫీ పంటలకు అనుకూలంగా ఉండటంతో, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రతి ఎకరాకు కనీసం 50 కిలోల అదనపు దిగుబడిని అంచనా వేస్తున్నారు.