అనంతగిరి మండలంలో గల మారుమూల ప్రాంతమైన నిమ్మ ఊట, కర్రిగోడ గ్రామాలకు కనీసపు రోడ్డు సౌకర్యం కల్పించి డోలిమోతను అరికట్టాలని సోమవారం సిపిఎం పార్టీ జడ్పిటిసి దిసారి గంగరాజు అన్నారు. కార్యకర్తలు, ప్రజలతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో డోలీ మోతలతో సతమతమవుతున్న గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి నిధులు కేటాయించాలని జడ్పిటిసి డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో కుమార్ కు వినతిపత్రం అందించారు.